Church Collapse: సంగారెడ్డిలో కూలిన చర్చి.. నలుగురు కూలీలు దుర్మరణం

Four Labours Dead In Sangareddy Due To Church Slab Collapse
  • నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం
  • శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరు కూలీలు
  • సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్ లు
నిర్మాణంలో ఉన్న చర్చి భవనం కుప్పకూలిన ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసేందుకు వారంతా శ్రమిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా కోహీర్ లో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం నిర్మాణ పనులు జరుగుతుండగా చర్చి స్లాబ్ సడెన్ గా కుప్పకూలింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ నిర్మాణ కూలీలు నలుగురు చనిపోయారు. మరో నలుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Church Collapse
Sangareddy
Labours Dead
Kohir
Church

More Telugu News