Elon Musk: డ్రగ్స్ తీసుకుంటారన్న ఆరోపణలపై ఎలాన్ మస్క్ స్పందన

Elon Musk Reaction After Facing Drugs Allegations
  • గతంలో స్నేహితుడితో కలిసి డ్రగ్స్ తీసుకున్న మాట వాస్తవమేనని వెల్లడి
  • ఇప్పుడు వాటి జోలికి వెళ్లడంలేదన్న టెస్లా చీఫ్
  • మూడేళ్లుగా టెస్టులు చేయించుకుంటున్నా తన శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు దొరకలేదని వివరణ
అమెరికా వ్యాపారవేత్త, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ డ్రగ్స్ తీసుకుంటారంటూ మరోమారు ఆరోపణలు వెల్లువెత్తాయి. అమెరికాలోని ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ (డబ్ల్యూఎస్ జే) ఈమేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. మస్క్ తీరుపై టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది. 

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంతో పాటు తన జవాబును మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. తన స్నేహితుడు రోగన్ తో కలిసి గతంలో ఒకసారి డ్రగ్స్ సేవించిన విషయం నిజమేనని చెప్పారు. అయితే, ఆ తర్వాత తాను డ్రగ్స్ తీసుకోలేదని వివరించారు. నాసా అభ్యర్థనతో టెస్లా ఆఫీసును డ్రగ్స్ రహితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. నాసా అభ్యర్థన మేరకు గత మూడేళ్లుగా తాను వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. అయితే, ఈ మూడేళ్లలో తన శరీరంలో డ్రగ్స్ కానీ, మద్యం ఆనవాళ్లు కానీ గుర్తించలేదని మస్క్ పేర్కొన్నారు.
Elon Musk
Drugs
Tesla
Spacex
Musk Tweet

More Telugu News