TSPSC: టీఎస్పీఎస్సీ కేసులో కొన్ని లింకులు మిస్సయ్యాయి: సిట్
- టీఎస్పీఎస్సీ అవకతవకలపై సిట్ దర్యాప్తు
- మీడియాకు వివరాలు తెలిపిన సిట్ అడిషనల్ కమిషనర్
- ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత అనేది తేలాల్సి ఉందని వెల్లడి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో అక్రమాలపై సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుపై సిట్ అడిషనల్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. టీఎస్పీఎస్సీ కేసులో కొన్ని లింకులు మిస్సయ్యాయని తెలిపారు. ఈ వ్యవహారంలో ఎవరు ఏం చేశారు? ఎవరి పాత్ర ఎంత వరకు ఉంది? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం తమ దర్యాప్తు ఈ అంశాల చుట్టూ తిరుగుతోందని పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని వివరాలతో మీడియా ముందుకు వస్తామని అడిషనల్ కమిషనర్ తెలిపారు. టీఎస్పీఎస్సీ కేసులో ఇప్పటివరకు 109 మందిని అరెస్ట్ చేశామని, ఈ కేసులో లోతైన దర్యాప్తు జరుగుతోందని, ఇంకా మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు.