Ashika Ranganath: అందం ఆమె ఇంటిపేరు .. ఆకర్షణ ఆమె రూపం పేరు.. తనే ఆషిక రంగనాథ్!

Ashika Ranganath Special
  • కన్నడ నుంచి వచ్చిన ఆషిక రంగనాథ్ 
  • అందం ... ఆకర్షణ ఆమె సొంతం
  • 'నా సామిరంగ'లో రొమాంటిక్ టచ్ ఉన్న రోల్ 
  • టాలీవుడ్ లో బిజీ అయ్యే ఛాన్స్ ఉన్న బ్యూటీ  

తెలుగు తెరకి ఎప్పటికప్పుడు అందమైన కథానాయికలు పరిచయమవుతూనే ఉంటారు. పదే పదే చూడాలనిపించేది .. అదే పనిగా ఆలోచింపజేసేది అందం అయితే .. ఆ జాబితాలో మనకి ఆషిక రంగనాథ్ కూడా కనిపిస్తుంది. కన్నడ నుంచి టాలీవుడ్ దిశగా అడుగులు వేసిన బ్యూటీలలో రీసెంటుగా ఆమె కూడా చేరిపోయింది. తెరపై కనిపిస్తూనే కుర్రాళ్ల మనసులను హోల్ సేల్ గా దోచేసింది. కల్యాణ్ రామ్ హీరోగా చేసిన 'అమిగోస్' సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. ఆ సినిమాలో గ్లామర్ పరంగా ఆమె మంచి మార్కులు కొట్టేసింది. ఈ మధ్య కాలంలో ఇంతటి అందాల రాశిని చూడలేదనే కుర్రాళ్లు చెప్పుకున్నారు. భాగ్యశ్రీ .. దివ్యభారతి తరువాత ఆ స్థాయి నాజూకు హీరోయిన్ అనిపించుకుంది. చక్కని కనుముక్కు తీరు కలిగిన నాయికగా ఆమెను గురించి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆషిక 'నా సామిరంగ' సినిమాతో ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర రొమాంటిక్ టచ్ తో నడుస్తుంది. సింగారం .. వయ్యారంతో పాటు, కాస్త పల్లెటూరి మొరటుదనంతో కూడిన ఈ పాత్రలో ఆమెను చూడటానికి అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఇక్కడ ఆమె బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి .. మిగతా హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Ashika Ranganath
Na Samiranga
Nagarjuna
Tollywood

More Telugu News