Amazon: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెజాన్ బృందం

Amazon reps met Telangana CM Revanth Reddy in Hyderabad
  • తెలంగాణలో పెట్టుబడులపై అమెజాన్ ఆసక్తి
  • నేడు హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం... పెట్టుబడులపై చర్చ
  • సమావేశంలో పాల్గొన్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, శ్రీధర్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తెలంగాణలో పెట్టుబడులపై ఆసక్తి చూపుతోంది. ఇటీవలే పదవి చేపట్టిన తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డిని నేడు అమెజాన్ ప్రతినిధులు హైదరాబాదులో కలిశారు. రేవంత్ రెడ్డితో సమావేశమైన అమెజాన్ బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై చర్చించింది. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను రేవంత్ రెడ్డి అమెజాన్ ప్రతినిధులకు వివరించారు. సచివాలయంలో ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 

ఇదిలావుంచితే, సీఎం రేవంత్ రెడ్డిని నిన్న గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ ప్రతినిధుల బృందం కూడా కలిసింది. గోద్రెజ్ ఆగ్రోవెట్ ఇప్పటికే తెలంగాణలో పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది.
Amazon
Revanth Reddy
Hyderabad
Telangana

More Telugu News