ips: ఐఏఎస్ భన్వర్‌లాల్‌తో వివాదం... ఐపీఎస్ నవీన్ కుమార్ తనయుడిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు
- సాహిత్‌ను జూబ్లీహిల్స్‌లోని ప్రకాశ్ నగర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- నవీన్ కుమార్ అన్న, వదినలను ఇదివరకే అరెస్ట్ చేసిన పోలీసులు
- కొన్నాళ్లుగా బన్వర్ లాల్, నవీన్ కుమార్ మధ్య వివాదం
ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ తనయుడు సాహిత్‌ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాహిత్‌ను జూబ్లీహిల్స్‌లోని ప్రకాశ్ నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. నవీన్ కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశముంది. నవీన్ కుమార్ అన్న, వదినలను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు.
ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్, మాజీ ఐఏఎస్ భన్వర్ లాల్ మధ్య గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. నవీన్ కుమార్ తన ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భన్వర్ లాల్ గతంలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలను సృష్టించి కబ్జాకు ప్రయత్నించారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ క్రమంలో 41ఏ కింద నోటీసులు ఇచ్చిన సీసీఎస్ పోలీసులు... నవీన్ కుమార్‌ను విచారించారు. ఈ వివాదం సమయంలోనే నవీన్ కుమార్ తాను ఉంటోన్న భన్వర్ లాల్ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. తాజాగా సాహిత్‌ను అరెస్ట్ చేశారు.