VV Lakshminarayana: ఏపీ ప్రజలు బీజేపీని ఎప్పుడో ఓడించారు... కానీ!: లక్ష్మీనారాయణ

VV Lakshminarayana says regional parties closely allied with BJP
  • విజయవాడలో మీడియాతో మాట్లాడిన లక్ష్మీనారాయణ
  • ఏపీలో ప్రాంతీయ పార్టీలు బీజేపీతో అంటకాగుతున్నాయని వ్యాఖ్యలు
  • మతోన్మాద పార్టీలను గద్దె దించాల్సిన అవసరం ఉందని పిలుపు
  • ప్రజలు ఏకతాటిపైకి వచ్చి ప్రత్యేక హోదా సాధించుకోవాలన్న లక్ష్మీనారాయణ
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ విజయవాడలోని తమ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని ఎప్పుడో ఓడించారని, కానీ, ప్రాంతీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా బీజేపీతో చెలిమి చేస్తున్నాయని విమర్శించారు. మతోన్మాద పార్టీలను గద్దె దింపాల్సిన అవసరం ఉందని అన్నారు. 

గతంలో కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రాంతీయ పార్టీలకు నాలుగు పర్యాయాలు అవకాశం లభించినా, నేతలు తమ స్వార్థం కోసం కేంద్రం కాళ్ల మీద పడిన సందర్భాలు ఉన్నాయని లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రాంతీయ పార్టీల వైఖరి చూస్తుంటే, ప్రత్యేక హోదా అంశానికి ముగింపు పలికినట్టే ఉందని అన్నారు. 

ప్రత్యేక హోదా అనేది నినాదంగానే మిగిలిపోకూడదని, ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటానికి జై భారత్ నేషనల్ పార్టీ అండగా ఉంటుందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
VV Lakshminarayana
Jai Bharat National Party
BJP
Regional Parties
Andhra Pradesh

More Telugu News