Raghu Rama Krishna Raju: ఈరోజు ఏపీలో అడుగుపెడుతున్న రఘురామకృష్ణరాజు.. రాజమండ్రి నుంచి భీమవరంకు రోడ్డు మార్గంలో పయనం!

Raghu Rama Krishna Raju going to Bhimavaram today
  • రఘురాజుపై ఇప్పటికే 11 కేసులు
  • సొంత నియోజకవర్గానికి వెళ్లేందుకు రక్షణ కల్పించాలని హైకోర్టును కోరిన రఘురాజు
  • రఘురాజును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈ సంక్రాంతి ఎంతో ప్రత్యేకమైనదిగా నిలవబోతోంది. ఎట్టకేలకు ఈరోజు ఆయన తన సొంత నియోజకర్గంలో అడుగుపెట్టబోతున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో ఆయన చేరుకోనున్నారు. అనంతరం రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో ఆచంట, పాలకొల్లు మీదుగా భీమవరం చేరుకుంటారు. వైసీపీపై తిరుగుబాటు చేసినప్పటి నుంచి ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. 

ఈ నేపథ్యంలో, తన ఊరు వచ్చేందుకు తనకు తగిన భద్రతను కల్పించాలంటూ ఏపీ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. తనపై 11 కేసులు పెట్టారని, ఊరికి వెళ్తే మరో కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో, ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. రఘురాజుకు చట్టపరమైన రక్షణ కల్పించాలని, అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు కల్పించిన ఊరటతో ఆయన భీమవరంకు వెళ్తున్నారు. సంక్రాంతి వేడుకలను తన నియోజకర్గంలో జరుపుకోనున్నారు. మరోవైపు రఘురాజుకు ఆహ్వానం పలికేందుకు ఆయన అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Raghu Rama Krishna Raju
YSRCP
Andhra Pradesh
Bhimavaram
Sankrathi

More Telugu News