ANR: ఏఐ టెక్నాలజీతో ఎంతో స్టయిలిష్ గా అక్కినేని నాగేశ్వరరావు... రామ్ గోపాల్ వర్మ ట్వీట్

Ram Gopal Varma shares a video of ANR designed with AI
  • ఏఐ టెక్నాలజీతో అక్కినేనిని మోడ్రన్ గా చూపించిన వైనం
  • వీడియో షేర్ చేసిన వర్మ
  • ఇప్పటి హెయిర్ స్టయిల్స్, ట్రెండీ దుస్తుల్లో అక్కినేని
ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఏఐ. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ)కు సంక్షిప్త రూపమే ఏఐ. ఏఐలో ఒక శాఖ అనదగ్గ డీప్ ఫేక్ టెక్నాలజీతో అనేక దుష్పరిణామాలు ఉన్నాయని ఇప్పటివరకు అనేక ఉదంతాలు నిరూపించాయి. అయితే, ఇతరుల వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగించనంతవరకు ఏఐని ఉపయోగించడంలో తప్పులేదు. ఏఐ టెక్నాలజీని అనేక రూపాల్లో మంచి పనులకు ఉపయోగించవచ్చు. 

ఇక అసలు విషయానికొస్తే... ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఆసక్తికర స్లైడర్ వీడియో పంచుకున్నారు. ఇందులో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావును ఎంతో స్టయిలిష్ గా మోడ్రన్ లుక్ తో చూపించారు. 

ఇప్పటి హెయిర్ స్టయిల్స్, కండలు, టోన్డ్ ఫేస్, ట్రెండీ దుస్తుల్లో ఉన్న ఏఐ అక్కినేనిని ఈ వీడియోలో చూడొచ్చు. ఆర్టిఫీషియల్ ఏఎన్నార్ ను ఎంతో ఇంటెలిజెంట్ గా క్రియేట్ చేశారని వర్మ ఈ వీడియోపై వ్యాఖ్యానించారు.
ANR
AI
RGV
Tollywood

More Telugu News