Vallabhaneni Balashowry: వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

MP Balashowry resigns to YSRCP

  • వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీల బదిలీ ఎఫెక్ట్
  • ఇప్పటికే వైసీపికి రాజీనామా చేసిన పలువురు ప్రజాప్రతినిధులు
  • బాలశౌరి జనసేనలో చేరే అవకాశం

వైసీపీలో ఓవైపు ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానచలనం ప్రక్రియ కొనసాగుతుండగా, మరోవైపు అసంతృప్తులు పార్టీని వీడే కార్యక్రమం ఊపందుకుంది. నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పు ప్రక్రియతో మనస్తాపం చెందిన పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు ఇప్పటికే రాజీనామా చేయగా, వారి బాటలోనే మరో వికెట్ పడింది! 

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి నేడు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేతకు పంపానని బాలశౌరి తెలిపారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఉండడంలేదని ఆయన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, బాలశౌరి జనసేన వైపు అడుగులు వేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన మరో రెండ్రోజుల్లో పవన్ ను కలిసి జనసేన కండువా కప్పుకునే అవకాశాలున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఒకవేళ బాలశౌరి జనసేనలో చేరితే... ఆ పార్టీ తరఫున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలున్నాయి. 

బాలశౌరి వైసీపీని వీడుతారని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో జగన్ ఫొటోలకు బదులు వైఎస్సార్ ఫొటోలు పెడుతుండడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. 


  • Loading...

More Telugu News