Vishal: విశాల్ ఊర మాస్ చిత్రం 'రత్నం'... సింగిల్ షాట్ లో ఫైట్ సీక్వెన్స్

Vishal starring Rathnam shooting continues with brisk pace
  • సింగం ఫేమ్ హరి దర్శకత్వంలో విశాల్  హీరోగా రత్నం
  • ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ
  • ఆసక్తికర వీడియో పంచుకున్న చిత్రబృందం
యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అనదగ్గ తమిళ హీరో విశాల్ తాజాగా నటిస్తున్న చిత్రం రత్నం. విశాల్ ట్రేడ్ మార్కు ఎలిమెంట్స్ తో రత్నం కూడా ఊర మాస్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. 

సింగం చిత్రాల ఫేమ్ హరి ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో విశాల్ సరసన ప్రియాభవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. సముద్రఖని, యోగిబాబు, గౌతమ్ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 1న ఈ చిత్రం నుంచి 'రా రా రత్నం' అంటూ టైటిల్ సాంగ్ రిలీజైంది. 

ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. విశాల్ పై కొన్ని ఫైట్ సీక్వెన్స్ లు చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ కణల్ కణ్నన్ ప్రత్యేకంగా సింగిల్ షాట్ ఫైట్ సీక్వెన్స్ ను డిజైన్ చేశారు. ఈ ఆలోచనను కణల్ కణ్నన్ చెప్పగానే విశాల్ థ్రిల్లయిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను చిత్రబృందం నేడు పంచుకుంది. రత్నం చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vishal
Rathnam
Hari
Fight Sequence
Single Shot
Kollywood

More Telugu News