Chandrababu: ఉండవల్లిలో ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం

Chandrababu and Pawan Kalyan has discusses many issues
  • ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్
  • మూడున్నర గంటల పాటు సమావేశం
  • ఎన్నికలే ప్రధాన అజెండగా భేటీ
  • 12 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో ఖరారు
  • ఈ నెలలో మేనిఫెస్టో ప్రకటన
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దాదాపు మూడున్నర గంటలపాటు ఈ సమావేశం సాగింది. ఈ కీలక భేటీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. 

కాగా, ఈ సమావేశంలో ఎన్నికలే ప్రధాన అజెండాగా చర్చలు సాగాయి. 12 అంశాలతో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. 

టీడీపీ ఇప్పటికే 'సూపర్ సిక్స్' పేరుతో మేనిఫెస్టో అంశాలను ప్రకటించగా, ఇప్పుడు వాటికి జనసేన 'షణ్ముఖ వ్యూహం' మరో ఆరు అంశాలను జోడించింది. ఈ నెలలోనే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. పొత్తులో అత్యంత కీలకమైన సీట్ల సర్దుబాటు విషయం కూడా చర్చించారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
Chandrababu
Pawan Kalyan
Nara Lokesh
Nadendla Manohar
TDP
Janasena
Undavalli

More Telugu News