AP DSC: నిరుద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త

DSC Notification Will Be Released After Sankranti Says AP Minister Botsa
  • సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్
  • కసరత్తు జరుగుతోందని వెల్లడించిన మంత్రి బొత్స
  • ఏ జిల్లాకు ఎన్ని పోస్టులనే వివరాలు త్వరలో వెల్లడి
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ ప్రకటన విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. నోటిఫికేషన్ జారీ చేయడానికి అవసరమైన కసరత్తు జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈమేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు త్వరలో శుభవార్త వెల్లడిస్తామని అన్నారు. డీఎస్సీ కోసం ఎదురుచూపులకు స్వస్తి పలుకుతామని చెప్పారు. సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బొత్స వెల్లడించారు. జిల్లాల వారీగా పోస్టుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. పండుగ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ పై స్పష్టత వస్తుందని మంత్రి వివరించారు.
AP DSC
DSC Notification
Andhra Pradesh
Botsa
Ycp
Sankranti

More Telugu News