Visakhapatnam: విశాఖలో పొగమంచుతో విమానాల రద్దు... ఎయిర్ లైన్స్ అధికారులను నిలదీసిన ప్రయాణికులు

Dense fog causes to planes cancellation in Vizag as passengers got angry on airlines staff
  • విశాఖను కమ్మేసిన పొగమంచు
  • ఇండిగో, ఎయిరిండియా విమానాల రద్దు
  • తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు
విశాఖలో దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖ నుంచి ఢిల్లీ, విజయవాడ, ముంబయి, హైదరాబాద్, చెన్నై వెళ్లాల్సిన విమానాలను అధికారులు రద్దు చేశారు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని, పొగమంచులో విమానాలు నడపలేమని అధికారులు స్పష్టం చేశారు.

ఈ పరిణామంతో ప్రయాణికులు మండిపడ్డారు. సంక్రాంతి పండుగకు తమ స్వస్థలాలకు సకాలంలో వెళ్లకుండా చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలంటూ ఎయిరిండియా, ఇండిగో విమాన సంస్థల అధికారులను నిలదీశారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. 

ఇవాళ ఉదయం నుంచే విశాఖను పొగమంచు కమ్మేసింది. దాంతో విశాఖ నుంచి వివిధ నగరాలకు వెళ్లాల్సిన ఇండిగో, ఎయిరిండియా విమానాలు నిలిచిపోయాయి.
Visakhapatnam
Fog
Planes
Cancellation
Passengers
Indigo
Air India

More Telugu News