The Raja Saab: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ‘ది రాజా సాబ్’ ఫస్ట్ లుక్ విడుదల.. డైరెక్టర్ మారుతీ ఆసక్తికర వ్యాఖ్యలు

Young rebel starer Prabhas movie The Raja Saab first look released
  • మారుతీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాకి ‘ది రాజా సాబ్’గా టైటిల్ ఖరారు
  • ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నల్లరంగు చొక్కా, నిక్కరుపై లుంగీ కట్టుతో ఆకట్టుకున్న యంగ్ రెబల్ స్టార్
  • ‘నాకు ఇదే బెస్ట్ సంక్రాంతి’ అని పేర్కొన్న డైరెక్టర్ మారుతీ 
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి పర్వదినాన అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పేరుని ‘ది రాజా సాబ్’గా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేసింది. ‘ఎక్స్’ వేదికగా ఫస్ట్ లుక్‌ను పంచుకున్న డైరెక్టర్ మారుతీ  ‘బహుశా ఈ ఏడాది సంక్రాంతే నాకు బెస్ట్’ అని వ్యాఖ్యానించాడు. 

‘‘ ఆఫీషియల్‌గా మీ అందరికీ ‘ది రాజా సాబ్’ను ప్రజెంట్ చేస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశాం. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. డార్లింగ్ ప్రభాస్‌ని ఎలా చూడాలనుకున్నారో అలా చూడబోతున్నారు.. అందుకు నాది ప్రామిస్’’ అని మారుతీ రాసుకొచ్చారు. నల్లరంగు చొక్కా, నిక్కరుపై లుంగీ కట్టుకొని ప్రభాస్ ఎనర్జిటిక్‌గా కనిపించడంతో ఈ ఫస్ట్ లుక్‌ని చూసి ప్రభాస్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. పిక్ అదుర్స్ అని కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ పిక్ నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాప్ ట్రెండింగ్స్‌లో ఒకటిగా నిలిచింది.

‘ ది రాజా సాబ్’ సినిమా హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ మధ్యే విడుదలైన సలార్ మూవీ విజయం సాధించడం, ‘కల్కీ’ సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించడంతో ఖుషీలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు ‘ది రాజా సాబ్’ ఫస్ట్ లుక్ మరింత ఆనందాన్ని ఇచ్చింది.


The Raja Saab
Prabhas
Director Maruthi
Prabhas fans
Tollywood
Movie News

More Telugu News