Sachin Tendulkar: సచిన్ డీప్ ఫేక్ వీడియోతో ప్రచారం.. సీరియస్ గా స్పందించిన క్రికెటర్

These videos are fake Says Sachin Tendulkar

  • గేమ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటూ ప్రచారం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • రిపోర్ట్ కొట్టాలంటూ అభిమానులకు సచిన్ పిలుపు

మొబైల్ గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్న సచిన్ టెండూల్కర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సచిన్ మాట్లాడుతూ.. సదరు గేమ్ యాప్ ను తన కూతురు కూడా ఉపయోగిస్తోందని, అందులోని గేమ్స్ ఆడుతూ రోజుకు లక్షా 80 వేల దాకా సంపాదిస్తోందని చెప్పాడు. అది చూసి తాను ఆశ్చర్యపోయానని, ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం ఇంత సులభంగా మారిపోయిందా అని అనుకున్నానని చెప్పాడు. ప్రముఖ క్రికెటర్ కావడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

లక్షలాదిమంది చూసిన ఈ వీడియో విషయం సచిన్ టెండూల్కర్ దాకా చేరింది. అలాంటి యాడ్ తాను ఎన్నడూ చేయలేదన్న సచిన్.. వెంటనే ఆ వీడియోను చూశాడు. ఆపై అది ఫేక్ అని, డీప్ ఫేక్ టెక్నాలజీతో తయారు చేసిందని చెప్పాడు. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి వీడియోలు తీయడం సరికాదంటూ సీరియస్ అయ్యాడు. ఈ తరహా వీడియోలు ఎక్కడ చూసినా వెంటనే రిపోర్ట్ కొట్టాలని తన అభిమానులకు సచిన్ పిలుపునిచ్చాడు.

  • Loading...

More Telugu News