Chandrababu: సంక్రాంతి వేళ సొంతూర్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు కుటుంబం... ఫొటోలు ఇవిగో!

Chandrababu and Lokesh attends various programs in their village
  • సంక్రాంతికి నారావారిపల్లె వచ్చిన చంద్రబాబు కుటుంబం
  • గ్రామదేవతలకు పూజలు
  • తల్లిదండ్రుల  సమాధుల వద్ద నివాళులు అర్పించిన చంద్రబాబు
  • కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల
సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమ సొంత గ్రామమైన నారావారిపల్లెలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. 

గ్రామ దేవతలు గంగమ్మ, నాగాలమ్మలకు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పూజలు చేశారు. తన తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

అనంతరం చంద్రగిరిలో పార్టీ నేత పులివర్తినానిని పరామర్శించారు. చంద్రగిరిలో దొంగ ఓట్లపై పోరాటంలో భాగంగా చేపట్టిన నిరసనల్లో అస్వస్థతకు గురైన పులివర్తి నాని ఇంటికి వెళ్లి చంద్రబాబు పరామర్శించారు. ఓటర్ జాబితాలో అక్రమాలపై మీడియాతో మాట్లాడారు. 

సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లె వచ్చిన చంద్రబాబును ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీనేతలు, పలు గ్రామాల ప్రజలు కలిశారు.
Chandrababu
Nara Lokesh
Sankranti
Naravaripalle
TDP
Andhra Pradesh

More Telugu News