Makara Jyothi: శబరిమలలో మకరజ్యోతి దర్శనం... తరించిపోయిన భక్తులు

Makara Jyothi seen visible tree times on Ponnambalamedu Hill
  • నేడు సంక్రాంతి
  • పొన్నాంబలమేడు కొండపై మూడుసార్లు కనిపించిన జ్యోతి
  • అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన శబరిమల 
కేరళలోని శబరిమల పుణ్యక్షేత్రంలో నేడు సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకరజ్యోతి దర్శనమిచ్చింది. ఇక్కడి పొన్నాంబలమేడు కొండపై ఈ సాయంత్రం మకరజ్యోతి దర్శనమివ్వగానే అయ్యప్ప స్వామి భక్తులు పులకించిపోయారు. మకరజ్యోతి మూడుసార్లు దర్శనమివ్వడంతో లక్షలాది మంది భక్తులు ఆనంద పారవశ్యంతో చూసి అయ్యప్పో స్వామియే... స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిమల క్షేత్రం మార్మోగిపోయింది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున అయ్యప్పస్వామి వారు జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. పొన్నాంబలమేడు పర్వతంపై అయ్యప్పస్వామికి దేవతలు, ఋషులు హారతి ఇస్తారని క్షేత్ర పురాణం చెబుతోంది.
Makara Jyothi
Sabarimala
Ponnambalamedu

More Telugu News