Preesha Chakraborty: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థిగా ప్రీషా చక్రవర్తి

Preesha Chakraborty named in worlds brightest students
  • జాబితా విడుదల చేసిన జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్
  • 90 దేశాలకు చెందిన 16 వేలమందిపై గెలుపు
  • 99 పర్సంటైల్ సాధించి రికార్డు
  • 2-12 గ్రేడ్‌లలో 250కిపైగా ఉన్న జాన్స్ హాప్‌కిన్స్ సీటీవీ ఆన్‌లైన్, ఆన్ క్యాంపస్ ప్రోగ్రాంలకు ప్రీషా  అర్హత 
తొమ్మిదేళ్ల భారతీయ-అమెరికా (ఇండియన్ అమెరికన్) విద్యార్థిని ప్రీషా చక్రవర్తి ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించుకుంది. 90 దేశాలకు చెందిన 16 వేలమంది విద్యార్థులను ఓడించి ప్రీషా ఈ ఘనత సాధించింది. ప్రతిష్ఠాత్మక జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (జేహెచ్-సీటీవై) ఈ మేరకు జాబితాను విడుదల చేసింది.

కాలిఫోర్నియా ఫ్రిమోంట్‌లోని వార్మ్‌స్ప్రింగ్ ఎలిమెంటరీ స్కూల్‌ విద్యార్థిని అయిన ప్రీషా జేహెచ్-సీటీవై నిర్వహించిన సమ్మర్ 2023 గ్రేట్ 3 టెస్టులో ఈ రికార్డు అందుకుంది.  స్కూల్ అసెస్‌మెంట్ టెస్ట్ (ఎస్ఏటీ), అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (ఏసీటీ), స్కూల్ అండ్ కాలేజీ ఎబిలిటీ టెస్ట్‌లలో ప్రీషా అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 

వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాల్లో ప్రీషా అడ్వాన్స్ గ్రేడ్5 ప్రదర్శనల్లో 99వ పర్సంటైల్‌తో సమానంగా గ్రాండ్ ఆనర్స్‌ను సొంతం చేసుకుంది. గణితం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, రసాయన, భౌతికశాస్త్రం, రీడింగ్, రైటింగ్ వంటి వాటిలో 2-12 గ్రేడ్‌లలో ఉన్న అడ్వాన్స్‌డ్ విద్యార్థుల కోసం 250కిపైగా ఉన్న జాన్స్ హాప్‌కిన్స్ సీటీవీ ఆన్‌లైన్, ఆన్ క్యాంపస్ ప్రోగ్రాంలకు ప్రీషా  అర్హత సాధించింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మెన్సా ఫౌండేషన్‌లో జీవితకాల సభ్యురాలు కూడా.

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన హై-ఐక్యూ సొసైటీ ఇది. 98 పర్సంటైల్ కంటే ఎక్కువ స్కోర్ చేసిన వారికి మాత్రమే ఇక్కడ సభ్యత్వం అందుబాటులో ఉంటుంది. కే-12 విద్యార్థులను అంచనా వేసే జాతీయస్థాయి నాగ్లీరీ నాన్ వెర్బల్ ఎబిలిటీ టెస్ట్ (ఎన్ఎన్ఏటీ)ని ఆరేళ్ల వయసులోనే పూర్తిచేయడం ద్వారా ప్రీషా ఈ ఘనత సాధించింది. అంతమాత్రాన ప్రీషా పుస్తకాల పురుగేం కాదు. ట్రావెలింగ్ అన్నా, హైకింగ్ అన్నా, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ అన్నా ఈ చిన్నారికి ఎంతో ఇష్టం.
Preesha Chakraborty
Indian-American Student
Warm Spring Elementary School
Johns Hopkins CTY

More Telugu News