addanki dayakar: తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను ఖరారు చేసిన కాంగ్రెస్

Congress announces Dayakar and Venkat for MLA quota MLC election
  • ఇద్దరికీ ఫోన్ చేసి సమాచారం అందించిన కాంగ్రెస్ పెద్దలు
  • నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించిన అధిష్ఠానం
  • ఎల్లుండితో ముగియనున్న నామినేషన్ గడువు
తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను ఫైనల్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు వారికి ఫోన్ చేసి సమాచారం అందించారు. నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

అద్దంకి దయాకర్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి టిక్కెట్ ఆశించారు. కానీ టిక్కెట్ దక్కలేదు. బల్మూరి వెంకట్ 2021 హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు జనవరి 18, గురువారంతో ముగియనుంది. ఎల్లుండి లోగా వారు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
addanki dayakar
balmoori venkat
Congress
mlc

More Telugu News