Mahesh Babu: బేసిక్ గా నాకు చిరంజీవి గారంటే చాలా ఇష్టం, గౌరవం: మహేశ్ బాబు 

Mahesh Babu says he has lot of respect for Megastar Chiranjeevi
  • గుంటూరు కారం చిత్రంలో 'స్వయంకృషి' ప్రస్తావన 
  • ఆ డైలాగ్ తన ఫేవరెట్ అని మహేశ్ బాబు వెల్లడి
  • థియేటర్లలో ఆ డైలాగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోందని ఆనందం
'గుంటూరు కారం' చిత్రం వసూళ్ల పరంగా బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్న నేపథ్యంలో హీరో మహేశ్ బాబు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

"ఈ సినిమాలో ఓ బ్రిలియంట్ సీన్ ఉంది... మీరు, త్రివిక్రమ్ గారు ఇందులో చిరంజీవి గారి ప్రస్తావన తీసుకువస్తూ స్వయంకృషి గురించి మాట్లాడడం గురించి చెబుతారా?" అని యాంకర్ సుమ అడిగింది. 

అందుకు మహేశ్ బాబు స్పందిస్తూ... "అది నా ఫేవరెట్ డైలాగ్ అండీ" అని బదులిచ్చారు.

"త్రివిక్రమ్ గారు కథ చెప్పినప్పటి నుంచి అది నన్ను ఆకట్టుకుంది. బేసిక్ గా నాకు చిరంజీవి గారంటే చాలా ఇష్టం. అయితే ఇప్పుడు డైలాగ్ ను చెప్పాలనుకోవడంలేదు... ఆ డైలాగును ప్రేక్షకులు థియేటర్లలోనే చూడాలి" అని పేర్కొన్నారు. 

చిరంజీవి గారి పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, ఆ డైలాగుతో తాను చాలా కనెక్ట్ అయ్యానని మహేశ్ బాబు వివరించారు. 

"త్రివిక్రమ్ గారు స్క్రిప్టు చెప్పేటప్పుడు ఆ డైలాగ్ వినగానే మొదట నవ్వొచ్చింది... ఆ తర్వాత చాలా బాగుంది అనిపించింది... ఈ డైలాగు చెబితే మామూలుగా ఉండదు సర్... థియేటర్లలో అదిరిపోతుంది అని అప్పుడే చెప్పాను. సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో ఆ డైలాగ్ కు వస్తున్న రెస్పాన్స్ అమోఘం" అని మహేశ్ బాబు పేర్కొన్నారు.
Mahesh Babu
Chiranjeevi
Guntur Kaaram
Swayamkrushi
Trivikram Srinivas
Tollywood

More Telugu News