Glenn Maxwell: కొన్నిసార్లు అంతే.. తన ట్యాక్సీలో ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఎక్కినా గుర్తించలేకపోయిన డ్రైవర్.. కావాలంటే వీడియో చూడండి!

Viral Video Taxi Driver Couldnt Recognise Glenn Maxwell And Adam Zampa
  • ట్యాక్సీ డ్రైవర్‌తో ముచ్చట్లు చెప్పిన ఆసీస్ క్రికెట్ స్టార్లు మ్యాక్స్‌వెల్, ఆడం జంపా
  • మ్యాక్స్‌వెల్‌తో మాట్లాడుతూ మంచి ఆటగాడంటూ ప్రశంసించిన డ్రైవర్
  • చివరికి గుర్తించి ఆశ్చర్యపోయిన వైనం
  • వైరల్ అవుతున్న పాత వీడియో
కొన్నిసార్లు అంతే.. అదృష్టం పక్కనే కూర్చుని ఉన్నా గుర్తుపట్టడం కష్టం. తీరా ఆ అదృష్టం కాస్తా దూరమయ్యాక అయ్యో అని బాధపడడం తప్ప చేసేది ఏమీ ఉండదు ఈ ట్యాక్సీ డ్రైవర్‌లా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ఆ ట్యాక్సీ డ్రైవర్‌‌పై అందరూ జాలి చూపిస్తున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్లు గ్లెన్ మ్యాక్స్‌వల్, ఆడం జంపా ఓ ట్యాక్సీ డ్రైవర్‌తో ముచ్చట్లలో పడ్డారు. ఆ ఇద్దరితో క్రికెట్ గురించి తెగమాట్లాడేస్తున్న డ్రైవర్.. తమ ముందున్నది ప్రపంచంలోని మేటి క్రికెటర్లని, ప్రపంచకప్ విన్నర్లని మాత్రం గుర్తుపట్టలేకపోయాడు. 

‘‘క్రికెట్ గురించి నీకేమైనా తెలుసా?’’ అన్న మ్యాక్స్‌‌వెల్ ప్రశ్నకు డ్రైవర్ బదులిస్తూ.. క్రికెట్ తనకు అత్యంత ఇష్టమైన ఆట అని చెప్పుకొచ్చాడు. అంతేకానీ, ఆ ప్రశ్న అడుగుతున్నది ఇద్దరు ఆసీస్ క్రికెటర్లని మాత్రం గుర్తించలేకపోయాడు. తనకు క్రికెట్ అని చెప్పడమే కాదు.. తానో మంచి బ్యాటర్‌ని అని కూడా డ్రైవర్ చెప్పాడు. రికీపాంటింగ్ ఉన్నప్పుడు గొప్ప జట్టుగా ఆస్ట్రేలియా వెలుగొందిందని చెప్పాడు. కల్పించుకున్న మ్యాక్స్‌వెల్ ఇప్పటికీ మంచిజట్టే కదా? అంటే అవునని అన్నాడు. 

డేవిడ్ వార్నర్ గురించి నీ అభిప్రాయం ఏంటన్న ప్రశ్నకు ‘మంచి ఆటగాడు’ అని ప్రశంసిస్తూనే మ్యాక్స్‌వెల్ కూడా బాగా ఆడతాడని పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఎందుకో అనుమానించిన డ్రైవర్.. ‘మీరూ..?’ అని మ్యాక్స్‌వెల్ వైపు తిరిగి.. అతనిని గుర్తించినట్టుగా ప్రశ్నిస్తే.. ‘అవును’ అని చెప్పడంతో ఆశ్చర్యపోతూ చెయ్యి కలిపాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ తిరుగుతోంది. అయితే, ఈ వీడియో కొత్తది కాదు.. చాలా ఏళ్ల పాతది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
Glenn Maxwell
Adam Zampa
Australia Cricket
Taxi Driver
Viral Video

More Telugu News