Revanth Reddy: రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

govt is creating digital health cards for all in the state says CM Revanth Reddy

  • రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్‌కార్డులు అందిస్తామన్న సీఎం
  • దావోస్‌లో ‘హెల్త్ కేర్ డిజిటలీకరణ’ అంశంపై మాట్లాడిన రేవంత్ రెడ్డి
  • డిజిటల్‌ హెల్త్ కార్డుల డేటా భద్రత, గోప్యతను కాపాడుతామని హామీ  

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ‘హెల్త్‌ కేర్‌ డిజిటలీకరణ’ అంశంపై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందించనున్నామని, ఈ మేరకు డిజిటల్‌ హెల్త్‌ కార్డులను రూపొందిస్తున్నామని ప్రకటించారు.  

డిజిటల్‌ హెల్త్ కార్డుల డేటా భద్రత, గోప్యతను కాపాడుతామని ఈ సందర్భంగా రేవంత్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతికత సహాయంతో నాణ్యమైన వైద్యసేవలను అందించనున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ అత్యుత్తమ వైద్యసేవలు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నామని రేవంత్ ప్రస్తావించారు. ఇక అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్‌వేర్‌ సేవలకు హైదరాబాద్‌ రాజధానిగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33 శాతం హైదరాబాద్‌ నగరంలో తయారవుతున్నాయని చెప్పారు. ఈ మేరకు ఆయన ఇన్వెస్టర్లను ఆకర్షించేలా ప్రసంగించారు.

  • Loading...

More Telugu News