harsha kumar: కోడి కత్తి కేసులో సాక్ష్యం చెప్పేందుకు జగన్ కు తీరిక లేదా?: హర్ష కుమార్

Harsha Kumar demand for arrest of ys jagan in kodi kathi case
  • శ్రీనును ఎంతకాలం జైల్లో ఉంచుతారన్న హర్షకుమార్ 
  • అతనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్  
  • ఐదేళ్లుగా ఓ దళితుడిని జైల్లో పెట్టడం దారుణమని వ్యాఖ్య
కోడి కత్తి దాడి కేసులో సాక్ష్యం చెప్పేందుకు ముఖ్యమంత్రి జగన్‌కు అంత తీరిక దొరకడం లేదా? ఇలాగే చేస్తే ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. అతనిని ఎంతకాలం జైల్లో ఉంచుతారు? న్యాయం, ధర్మం లేవా? అంటూ ప్రశ్నించారు. కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హర్ష కుమార్ రాజమహేంద్రవరంలోని తని నివాసంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీనును వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లుగా ఓ దళితుడిని జైల్లో పెట్టడం దారుణమని మండిపడ్డారు.

జగన్‌కు అయిన గాయం కూడా మరీ తీవ్రమైనదేమీ కాదన్నారు. దానిని ఆసరాగా చేసుకొని ప్రయోజనం పొందారని ఆరోపించారు. జగన్‌ను ఓడించడమే తమ లక్ష్యమన్నారు. దళితులంటే జగన్‌కు ఏమాత్రం ప్రేమ లేదని ఆరోపించారు.
harsha kumar
YS Jagan
Andhra Pradesh

More Telugu News