SC Classification: ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయసేకరణ కోసం ప్రత్యేక కమిటీ నియామకం

Centre appoints five men committee on SC Classification

  • ఎస్సీ వర్గీకరణ కోసం దశాబ్దాలుగా డిమాండ్లు
  • 30 ఏళ్లుగా పోరాడుతున్న ఎమ్మార్పీఎస్
  • కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో తాజాగా కమిటీ
  • ఈ నెల 22న సమావేశం కానున్న ఐదుగురు సభ్యుల కమిటీ

ఎస్సీ వర్గీకరణ అంశం ఎన్నో ఏళ్లుగా నలుగుతూ వస్తోంది. ఎస్సీలలో ఓ వర్గమే రిజర్వేషన్లలో అత్యధిక లబ్ది పొందుతోందన్నది ప్రధాన వాదన. ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ తెలుగు రాష్ట్రాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) మూడు దశాబ్దాలుగా పోరాడుతోంది. 

ఎస్సీ వర్గీకరణ డిమాండ్లు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో, కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం, అభిప్రాయ సేకరణ కోసం ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన శాఖ కార్యదర్శులు కూడా సభ్యులుగా ఉంటారు. 

ఈ కమిటీ జనవరి 22న సమావేశం కానుంది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కేంద్రం ఈ కమిటీకి స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News