Chandrababu: దారితప్పిన చంద్రబాబు హెలికాప్టర్... అప్రమత్తం చేసిన ఏటీసీ

ATC warns Chandrababu helicopter after it going in wrong path
  • విశాఖ నుంచి అరకు వెళుతుండగా కలకలం
  • చంద్రబాబు హెలికాప్టర్ కు ఏటీసీతో సమన్వయ లోపం
  • హెలికాప్టర్ రాంగ్ రూట్లో వెళుతున్న విషయాన్ని పైలెట్ కు వివరించిన ఏటీసీ
  • వెంటనే వెనక్కి మళ్లిన హెలికాప్టర్
టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ నుంచి అరకు వెళుతుండగా కలకలం రేగింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పింది. చంద్రబాబు హెలికాప్టర్ కు ఏటీసీతో సమన్వయ లోపం తలెత్తింది. చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పిన విషయాన్ని గుర్తించిన ఏటీసీ వెంటనే పైలెట్ ను అప్రమత్తం చేసింది. తాము నిర్దేశించిన మార్గంలో హెలికాప్టర్ వెళ్లడం లేదని, రాంగ్ రూట్లో వెళుతోందని ఏటీసీ చంద్రబాబు హెలికాప్టర్ పైలెట్ కు వివరించింది. ఏటీసీ హెచ్చరికలతో చంద్రబాబు హెలికాప్టర్ వెంటనే వెనుదిరిగింది. మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతించడంతో చంద్రబాబు సురక్షితంగా అరకు చేరుకున్నారు.
Chandrababu
Helicopter
Wrong Root
ATC
Araku
Vizag
TDP
Andhra Pradesh

More Telugu News