Narendra Modi: రామేశ్వరంలోని పురాతన రామనాథ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు

PM Modi Takes Holy Dip In Rameswaram Ahead Of Ram Temple Opening
  • అగ్నితీర్థం బీచ్‌లో పుణ్యస్నానమాచరించిన ప్రధాని మోదీ
  • గుడిలో జరిగిన భజన కార్యక్రమంలోనూ పాల్గొన్న ప్రధాని
  • కొన్ని రోజులుగా రాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తోన్న మోదీ
అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠకు ముందు ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు రామేశ్వరంలోని పురాతన శివాలయ ప్రాంగణంలోని రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు అగ్నితీర్థం బీచ్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. సముద్ర స్నానం అనంతరం ఇక్కడి తీర్థ బావుల జలాలను ఒంటిపై పోసుకున్నారు. రుద్రాక్షమాల ధరించిన మోదీకి రామనాథస్వామి ఆలయ పూజారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. గుడిలో జరిగిన భజన కార్యక్రమంలోనూ ప్రధాని పాల్గొన్నారు.

రామనాథపురం జిల్లాలోని రామేశ్వరం ద్వీపంలో ఉన్న ఈ శివాలయానికి రామాయణంతో సంబంధం ఉంది. ఇక్కడి శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. సీతారాములు ఇక్కడ శివుడిని ప్రార్థించారని చెబుతారు. తిరుచ్చిరాపల్లి జిల్లాలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో పూజల అనంతరం ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకున్న ప్రధాని మోదీకి బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. కాగా, ప్రధాని మోదీ గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు.
Narendra Modi
Ayodhya Ram Mandir
Ayodhya Ram Temple
rameswaram

More Telugu News