Vijayashanti: కాళేశ్వరం బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలి: కేటీఆర్ కు విజయశాంతి కౌంటర్

Vijayasanthi counters KTR comments
  • కరెంటు బిల్లులు ఎవరూ కట్టొద్దన్న కేటీఆర్
  • బిల్లులు సోనియా ఇంటికి పంపాలని పిలుపు
  • కష్టమైనా సరే కాంగ్రెస్ హామీలు అమలు చేసి తీరుతుందన్న విజయశాంతి
జనవరి నెల కరెంటు బిల్లులు ఎవరూ కట్టొద్దని, కరెంటు బిల్లులను సోనియా గాంధీకి పంపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. కరెంటు బిల్లులు సోనియా గాంధీకి పంపించాలని చెబుతున్న కేటీఆర్... కాళేశ్వరం దోపిడీ బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలని చెప్పాలని డిమాండ్ చేశారు. ఖజానా మొత్తం దోచుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పులపాలు చేసిన సంగతి కేటీఆర్ కు పూర్తిగా తెలుసని, కాబట్టే కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు జరగవని చెబుతున్నారని విజయశాంతి విమర్శించారు. కష్టమైనా సరే, కాంగ్రెస్ అన్ని హామీలు అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు.
Vijayashanti
KTR
KCR
Kaleswaram
Electricity Bills
Congress
BRS
Telangana

More Telugu News