Ayodhya Prasad box: రామమందిర ప్రారంభోత్సవం ఆహ్వానితులకు ప్రత్యేకంగా ప్రసాదం బాక్స్!

Special prasad box for invitees in Ayodhya

  • కాషాయ రంగులోని ప్రసాదం బాక్సులో లడ్డూలు సహా ఏడు రకాల ఐటెమ్స్
  • ప్రసాదం బాక్సులను ఉచితంగా తయారు చేస్తున్న ఉత్తరప్రదేశ్ స్వీట్ షాప్ ‘ఛప్పన్ భోగ్’
  • అతిథులకు ప్రసాదం బాక్సులతో పాటూ మహప్రసాదం కూడా ఇవ్వనున్న రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు

రామమందిర ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొనే ఆహ్వానితులకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రసాదం బాక్స్‌ను ఇవ్వనున్నారు. ఇందులో లడ్డూలు, దీపపు కుందెతో పాటూ ఏడు రకాల ఇతర వస్తువులు ఉంటాయి. లక్నోలోని ప్రముఖ స్వీట్ షాపు ‘ఛప్పన్ భోగ్’ ఈ బాక్సులను సిద్ధం చేస్తోంది. ఒక్కో బాక్సులో రెండు నేతి లడ్డూలు, గుర్ రెవ్డీ, రామ్దానా చిక్కీ, అక్షింతలు, రోలీ, తులసీ దళాలు, దీపపు కుందె, తీపి యాలకులు ఉంటాయి. కాషాయ రంగులో ఉండే ఈ బాక్సుపై శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు, హనుమాన్ గర్హీ లోగోలు ఉంటాయి. ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాగులో వీటిని పెట్టి ఇస్తారు.

రామ మందిర ట్రస్టు వారు మొత్తం 15 వేల బాక్సులకు ఆర్డర్ చేశారు. ప్రసాదం బాక్సులు తయారు చేసే అవకాశం దక్కినందుకు పొంగిపోయిన ‘ఛప్పన్ భోగ్’ నిర్వాహకులు వాటిని ఉచితంగా చేసేందుకు ముందుకొచ్చారు. అతిథులకు ప్రసాదం బాక్సుతో పాటూ మహా ప్రసాదం, నేతితో చేసిన ఆహారాన్ని అందించనున్నారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో గుజరాత్‌కు చెందిన భారతీ గర్వీ గుజరాత్, సంత్ సేవా సంస్థాన్ మహా ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నాయి. మొత్తం 200 మంది సిబ్బంది..5 వేల కేజీల ముడి పదార్థాలతో ప్రసాదం సిద్ధం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News