Ramcharan: అద్భుతం... జీవితంలో ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం: అయోధ్య రామమందిరంపై రామ్ చరణ్.. వీడియో ఇదిగో

Actor Ram Charan says Ram Mandhir  beautiful and Once in a lifetime
  • అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠలో పాల్గొన్న రామ్ చరణ్ తేజ్
  • ఈ మహత్తర ఘట్టాన్ని కనులారా వీక్షించడం ప్రతి ఒక్కరికీ గౌరవమని వ్యాఖ్య
  • నిజంగా భగవంతుడి ఆశీర్వాదమే అన్న రామ్ చరణ్ తేజ్
అయోధ్య రామమందిరం అద్భుతం... జీవితంలో ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం... ఈ మహత్తర ఘట్టాన్ని కనులారా వీక్షించడం ప్రతి ఒక్కరికీ గౌరవమని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అన్నారు. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ... భారతదేశంలో పుట్టడం... ఈ ప్రాణప్రతిష్ఠ వేడుకను కళ్లారా చూడటం ఆనందంగా ఉందన్నారు. ఇది ఆ భగవంతుడి ఆశీర్వాదమే అన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం పూర్వ జన్మ సుకృతమన్నారు. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. వీరు ప్రత్యేక విమానంలో అయోధ్యకు వెళ్లారు.
Ramcharan
Ayodhya
Ayodhya Ram Mandir
Ayodhya Ram Temple

More Telugu News