Indian Stock Market: హాంకాంగ్ ను అధిగమించి.. ప్రపంచంలోనే నాలుగో అత్యంత విలువైన స్టాక్ మార్కెట్ గా ఎదిగిన భారత్
- 4.33 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న భారత స్టాక్ మార్కెట్ల కంబైన్డ్ షేర్ల విలువ
- 4.29 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉన్న హాంకాంగ్ మార్కెట్ క్యాపిటలైజేషన్
- 50.86 ట్రిలియన్ డాలర్లతో తొలి స్థానంలో అమెరికా
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ మరో ఘనతను సాధించింది. హాంగ్ కాంగ్ స్టాక్ మార్కెట్ ను వెనక్కి నెట్టి... ప్రపంచంలోనే నాలుగో అత్యంత విలువైన మార్కెట్ గా అవతరించింది. దేశ వృద్ధిరేటు, విధానపరమైన సంస్కరణల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లకు భారత స్టాక్ మార్కెట్ అత్యంత సుస్థిరమైన, నమ్మకమైనదిగా మారింది.