MP Ranjith Reddy: బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ స్టేషన్‌లో కేసు నమోదు

case has been registered against BRS MP Ranjith Reddy at Banjara Hills station

  • తనకు ఫోన్ చేసి అగౌరవంగా, అసభ్యకరంగా మాట్లాడారని ఫిర్యాదు చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
  • బీఆర్ఎస్ నేతలు, సర్పంచులతో ఎందుకు మాట్లాడుతున్నారంటూ కాల్ చేశారని ఫిర్యాదు
  • కోర్టు సలహా మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా చేవెళ్ల ఎంపీ, బీఆర్ఎస్ నేత రంజిత్ రెడ్డిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. తమ పార్టీకి చెందిన నేతలు, సర్పంచ్‌లను ఎందుకు కలుస్తున్నావని, ఎందుకు మాట్లాడుతున్నావంటూ అగౌరవంగా మాట్లాడారని, అసభ్యకరంగా మాట్లాడారని విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు జనవరి 17న రంజిత్ రెడ్డి తనకు కాల్ చేశారని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. జనవరి 20న ఆయన ఫిర్యాదు చేశారు.

రంజిత్‌రెడ్డిపై ఐపీసీ సెక్షన్‌ 504 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు విషయంలో న్యాయ సలహా తీసుకున్నామని బంజారాహిల్స్ ఇన్స్‌పెక్టర్ సతీష్ తెలిపారు. నాంపల్లిలోని మూడో ఏసీఎంఎం కోర్టును సంప్రదించగా పోలీసులకు కీలక సూచనలు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉన్న సమయంలో జరిగిన ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News