Ravichandran Ashwin: ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెడుతున్న అశ్విన్.. 5 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన పర్యాటక జట్టు

England lost 3 wicketes in just 5 runs span
  • టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్
  • రెండు వికెట్లు పడగొట్టిన అశ్విన్
  • జడేజాకు ఓ వికెట్
ఉప్పల్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కేవలం 5 పరుగుల తేడాతో వరుసగా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

55 పరుగుల వద్ద ఓపెనర్ బెన్ డకెట్‌(35)ను అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత మూడు పరుగులకే ఒల్లీ పోప్‌(1))ను రవీంద్ర జడేజా వెనక్కి పంపాడు. అనంతరం మరో రెండు పరుగుల తర్వాత జాక్ క్రాలీ (20)ని అశ్విన్ అవుట్ చేశాడు.

స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఆ తర్వాత జాగ్రత్త పడింది. ప్రతి బంతినీ ఆచితూచి ఎదుర్కొంటోంది. పర్యాటక జట్టు ప్రస్తుతం మూడు వికెట్ల నష్టానికి 86 పరుగులతో ఉంది. జో రూట్ (13), జానీ బెయిర్‌స్టో (16) క్రీజులో ఉన్నారు.
Ravichandran Ashwin
Team India
Team England
Uppal Test

More Telugu News