Revanth Reddy: ఆ మూడు జిల్లాల మంత్రులు, నాయకులకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సందేశం
- ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లా నేతలకు రేవంత్ రెడ్డి సందేశం
- పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో అర్హులైన వారిని ఓటరుగా నమోదు చేయాలని సూచన
- నూతన ఓటర్ల నమోదు గడువు ఫిబ్రవరి 6వ తేదీన ముగియనుందని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందేశాన్ని ఇచ్చారు. శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు చెందిన మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు, జిల్లా పార్టీ అధ్యక్షులకు కొత్త ఓటర్ల నమోదు అంశంపై విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం-నల్గొండ-వరంగల్ మండలి నియోజకవర్గంలో నూతన ఓటర్ల నమోదు గడువు ఫిబ్రవరి 6వ తేదీన ముగియనుందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఆ తేదీలోగా మీ పరిధిలో కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఎలాంటి అశ్రద్ధ చేయకుండా విధిగా దీనిని చేపట్టాలని కోరారు. రేవంత్ రెడ్డి... టీపీసీసీ అధ్యక్షుడి పేరుతో ఆయన కార్యకర్తలకు సందేశం ఇచ్చారు.