Anitha: అవినీతి తోటలో విరబూసిన 'రోజా': అనిత

Anitha on Roja corruption

  • రోజా అవినీతికి అంతే లేకుండా పోయిందన్న అనిత
  • గ్రావెల్, ఇసుక, గ్రానైట్, భూ దందాలు చేస్తున్నారని ఆరోపణ
  • దళిత కౌన్సిలర్ వద్ద కూడా లంచం వసూలు చేశారని విమర్శ

ఏపీ మంత్రి రోజా అవినీతికి అంతే లేకుండా పోయిందని టీడీపీ నాయకురాలు అనిత అన్నారు. నగరి ప్రజలకు రోజా ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు గ్రావెల్ దందా, ఇసుక దందా, గ్రానైట్ దందా, భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. చివరకు టోల్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారని విమర్శించారు. 

ఆర్డీఓ ఆఫీస్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, ఎమ్మార్వో ఆఫీసులను ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరికి అప్పజెప్పారని... సమస్యను వీళ్లే క్రియేట్ చేస్తారని, దీంతో బాధితులు వీరి దగ్గరకు వస్తారని, వాళ్లతో కమిషన్ తీసుకుని వీళ్లు సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. నగరి ప్రజలు అడుగు తీసి అడుగు వేయాలన్నా 'ఆర్' ట్యాక్స్ కట్టాల్సిందేనని విమర్శించారు. చివరకు దళిత కౌన్సిలర్ దగ్గర కూడా లంచం వసూలు చేసిన ఘనత రోజాదని అన్నారు. రోజా అవినీతి గురించి ఒక పుస్తకం రాయొచ్చని... దానికి 'అవినీతి తోటలో విరబూసిన రోజా' అనే పేరు పెట్టొచ్చని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News