Venkaiah Naidu: వెంకయ్య నాయుడు, చిరంజీవికి కేటీఆర్, జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు

KTR and Jr NTR tweets on Venkaiah Naidu and Chiranjeevi
  • మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవి పద్మవిభూషణ్‌కు ఎంపిక
  • తెలంగాణ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారికి కేటీఆర్ అభినందనలు    
  • పద్మ అవార్డు గ్రహీతల విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి అన్న జు.ఎన్టీఆర్ 
పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య, బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, వేలు ఆనంద చారి, కేతావత్ సోమ్లాల్,  కూరెళ్ల విఠలాచార్యకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. 

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వెంకయ్యనాయుడు, చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. వారి విజయాలు రాబోయే తరాల్లో స్ఫూర్తిని రగిలించాలని ఆకాంక్షించారు.
Venkaiah Naidu
Chiranjeevi
KTR
Jr NTR
Padma awards

More Telugu News