Mohan Babu: ఈ అవార్డుకు చిరంజీవి అన్ని విధాలా అర్హుడు: మోహన్ బాబు

Mohan Babu wishes Chiranjeevi on being conferred with Padma Vibhushan
  • మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్
  • నా ప్రియ మిత్రుడికి అభినందనలు అంటూ మోహన్ బాబు ట్వీట్
  • చిరంజీవి... నిన్ను చూసి గర్విస్తున్నాం అంటూ హర్షం 
తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి, అగ్రనటుడు మోహన్ బాబు మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో మోహన్ బాబు స్పందించారు. చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. "నా ప్రియ మిత్రుడు చిరంజీవికి అభినందనలు. ఈ పురస్కారానికి చిరంజీవి అన్ని విధాలా అర్హుడు. నువ్వు ఈ అవార్డు అందుకోబోతున్నందుకు మేమంతా ఎంతో గర్విస్తున్నాం" అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.
Mohan Babu
Chiranjeevi
Padma Vibhushan
Tollywood

More Telugu News