Medaram Jatara: మేడారం జాతర సమయంలో మహిళల నుంచి టికెట్ వసూలు చేద్దామన్న సజ్జనార్.. వద్దన్న భట్టి విక్రమార్క!

Free Journey for women in special buses in Medaram Jatara also
  • వచ్చే నెల 18 నుంచి 25 వరకు మేడారం జాతర
  • 6 వేల ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ
  • మహిళల నుంచి టికెట్ వసూలు చేస్తే ఆదాయం పెరుగుతుందన్న సజ్జనార్
  • అలాంటి పనులు వద్దన్న మంత్రి భట్టి విక్రమార్క
మేడారం జాతర సమయంలో మహిళల నుంచి టికెట్ వసూలు చేయాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తోసిపుచ్చారు. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి భట్టి, రవాణశాఖమంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న మేడారం జాతర సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సుల్లో మహిళల నుంచి టికెట్ వసూలు చేస్తే సంస్థ ఆదాయం పెరుగుతుందని ప్రతిపాదించారు. 

స్పందించిన భట్టి.. అది సరికాదని, ఎట్టిపరిస్థితుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక్క మేడారమే కాదని, ఏ జాతర సమయంలోనూ మహిళల నుంచి టికెట్ వసూలు చేయవద్దని ఆదేశించారు. వచ్చే నెల 18 నుంచి 25 వరకు జరగనున్న మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 6 వేల బస్సులు నడపాలని నిర్ణయించింది. ఒక్క హైదరాబాద్ నుంచే 2 వేల బస్సులను సిద్ధం చేస్తున్నారు.
Medaram Jatara
TSRTC
VC Sajjanar
Mallu Bhatti Vikramarka

More Telugu News