Anand Mahindra: ఇతర దేశాల సైన్యాలకు నాదో సలహా: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra interesting tweet about Indian army capability
  • నిన్న ఢిల్లీలో భారత గణతంత్ర వేడుకలు
  • సత్తా ప్రదర్శించిన భారత త్రివిధ దళాలు
  • సిఖ్ రెజిమెంట్ కవాతు వీడియో పంచుకున్న ఆనంద్ మహీంద్రా
  • వీళ్లతో మాత్రం పెట్టుకోవద్దని ఇతర దేశాలకు స్పష్టీకరణ
ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో భారత సైన్యం ప్రదర్శించిన కవాతు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. త్రివిధ దళాలకు చెందిన బలగాలు, వాటి ఆయుధ సంపత్తి నిన్నటి గణతంత్ర వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో శత్రు దేశాలకు స్పష్టమైన సందేశాన్ని పంపాయి. 

కాగా, భారత సైన్యం ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో కదం తొక్కిన తీరుపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికరంగా స్పందించారు. రిపబ్లిక్ డే రోజున భారత సైన్యంలోని సిఖ్ రెజిమెంట్ ప్రదర్శించిన అత్యంత క్రమశిక్షణతో కూడిన కవాతు వీడియోను ఆయన ట్వీట్ చేశారు. 

"ఇతర దేశాల సైన్యాలకు నాదో వ్యక్తిగత సలహా. ఎప్పుడు కూడా... ఎప్పటికీ కూడా వీళ్లతో మాత్రం పెట్టుకోవద్దు" అంటూ స్పష్టం చేశారు. ఆనంద్ మహీంద్రా పోస్టుకు ఎక్స్ లో వేలల్లో లైకులు, రీట్వీట్లు వస్తున్నాయి.
Anand Mahindra
Indian Army
Sikh Regiment
Republic Day
India

More Telugu News