traffic challan: తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.135 కోట్లు
- 1.50 కోట్ల పెండింగ్ చలాన్ల చెల్లింపుల ద్వారా భారీగా ఆదాయం
- హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.34 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.25 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో రూ.16 కోట్ల రాబడి
- 3.59 కోట్ల పెండింగ్ చలాన్లకు 42.38 శాతం చెల్లింపులు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీతో ప్రభుత్వానికి రూ.135 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 1.50 కోట్ల చలాన్ల చెల్లింపులు జరగగా రూ.135 కోట్లు వచ్చింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.34 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.25 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో రూ.16 కోట్ల ఆదాయం వచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పెండింగ్ చలాన్లు 3.59 కోట్లు ఉండగా... 42.38 శాతం చలాన్లకు మాత్రమే చెల్లింపులు జరిగాయన్నారు. దాదాపు 1.50 కోట్ల చలాన్ల చెల్లింపులు జరిగాయి. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఆటో, బైక్ వాహనాలపై 80 శాతం, కార్లు, జీపులపై 60 శాతం, తోపుడు బండ్లు వంటి వాటి మీద 90 శాతం, ఆర్టీసీ బస్సులపై 90 శాతం డిస్కౌంట్ ఇచ్చారు.