Engineering Student: కాలేజీ హాస్టల్‌లో ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రసవం.. ఆపై చికిత్స పొందుతూ మృతి

Engineering Student Died After Gave Birth To Baby In Panyam
  • నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో ఘటన
  • మూడు నెలల క్రితమే కాలేజీలో చేరిన విద్యార్థిని
  • గర్భిణిగా ఉన్నా గుర్తించలేకపోయిన తోటి విద్యార్థులు
ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని తానుంటున్న హాస్టల్‌లోనే ప్రసవించి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. మూడు నెలల క్రితమే కాలేజీలో చేరిన విద్యార్థిని గర్భిణిగా ఉన్నా గుర్తించకపోవడం, ప్రసవించే వరకు తోటి విద్యార్థులకు తెలియకపోవడం గమనార్హం. 

శుక్రవారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు ఫోన్ చేసిన విద్యార్థిని కాలేజీకి రావాలని కోరింది. రాత్రి 9 గంటల సమయంలో హాస్టల్ బాత్రూములో బిడ్డను ప్రసవించింది. అనంతరం స్పృహ కోల్పోయిన యువతిని కాలేజీ యాజమాన్యం సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. అయితే, అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి నిన్న మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Engineering Student
Nandyal District
Panyam
Andhra Pradesh
Andhra News

More Telugu News