Michael Vaughan: ప్రపంచంలోని బెస్ట్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్, పాండ్యా కాదట.. మరెవరో చెప్పిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్
- ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా సూపర్ పర్ఫార్మెన్స్
- తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి, 87 పరుగులు తీసిన ఆల్‌రౌండర్
- ఇప్పటికి జడేజానే అత్యుత్తమ ఆల్‌రౌండర్ అంటూ వాన్ కితాబు
హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన జడేజా అర్ధ సెంచరీ బాదాడు. జడేజా ఆటతీరుపై ఇంగ్లండ్ మాజీ స్కిప్పర్ మైఖేల్ వాన్ ప్రశంసలు కురిపించాడు. ఇప్పటికి జడేజానే ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్ అని ఆకాశానికెత్తేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 87 పరుగులు చేసి రూట్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో వాన్ పై విధంగా స్పందించాడు. బెన్‌స్టోక్స్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లను పక్కనపెట్టి మరీ జడేజాను ప్రశంసించాడు. అతడే అత్యుత్తమ ఆల్‌రౌండర్ అని కితాబిచ్చాడు. కాగా, ఇంగ్లండ్ ఈ ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసి భారత్‌పై 198 పరుగుల ఆధిక్యంలో ఉంది.