Jawahar: భీమిలి సభలో జగన్ శిలువ గుర్తుపై నడిచాడు... ఎన్నికల్లో ఆ శాపం తగులుతుంది: కేఎస్ జవహర్

TDP leader Jawahar slams CM Jagan
  • నిన్న భీమిలిలో వైసీపీ సిద్ధం సభ
  • హాజరైన సీఎం జగన్
  • ఓ ర్యాంప్ పై నడిచిన వైనం
  • ఆ ర్యాంప్ శిలువ ఆకృతిలో ఉందన్న టీడీపీ నేత జవహర్
  • జగన్ క్రైస్తవులను అపహాస్యం చేశాడంటూ ఆగ్రహం
ఏపీ సీఎం జగన్ నిన్న భీమిలిలో సిద్ధం సభకు హాజరవడం తెలిసిందే. అయితే, భీమిలి సభలో సీఎం జగన్ శిలువ గుర్తుపై నడిచారని, ఎన్నికల్లో  వైసీపీకి అది శాపంగా మారుతుందని టీడీపీ నేత కేఎస్ జవహర్ అన్నారు. తన చర్యలతో సీఎం జగన్ క్రైస్తవులను అపహాస్యం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసు క్రీస్తు శిలువను మోశాడని, కానీ జగన్ శిలువపై నడిచాడని, వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమని జవహర్ వ్యాఖ్యానించారు. 

భీమిలి సభలో శిలువ ఆకృతిలో ఒక ర్యాంప్ ను ఏర్పాటు చేశారని, ఆ ర్యాంప్ పై జగన్ నడిచారని వివరించారు. బైబిల్ లో ఉన్న 10 ఆజ్ఞలను జగన్ అతిక్రమించారని ఆరోపించారు. భీమిలి సభ జగన్ అహంకారానికి నిదర్శనంలా నిలిచిందని అన్నారు. 
Jawahar
Jagan
Bhimili
TDP
YSRCP

More Telugu News