Bandi Sanjay: నేను మఠం పెట్టుకుంటే... నువ్వు టోపీ పెట్టుకో, గడ్డం పెంచుకో!: కేటీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
- ధర్మం కోసం పని చేసేవాళ్లయితే మఠం పెట్టుకోవాలన్న కేటీఆర్
- నీ అయ్య బాగా తాగుతాడు కాబట్టి బార్ పెట్టుకోవాలని బండి సంజయ్ కౌంటర్
- గ్రామపంచాయతీలకు బీఆర్ఎస్ ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపణ
ధర్మం కోసం పని చేసేవాళ్లయితే మఠం పెట్టుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అలా అయితే కేసీఆర్ బార్ పెట్టుకోవాలని... కేటీఆర్ మసీదును నిర్మించుకోవాలని ఎద్దేవా చేశారు. సోమవారం బీజేపీ నేత సంజయ్ మీడియాతో మాట్లాడుతూ... కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నాస్తికుడని... కేటీఆర్ కూడా నాస్తికుడే అన్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ పెద్ద మేధావిలా పోజులు కొడుతున్నారని విమర్శించారు.
"బండి సంజయ్ హిందుత్వం కోసం... ధర్మం కోసం పనిచేస్తే.. మఠం పెట్టుకోవాలంట... నీ అయ్య బాగా తాగి ప్రజలకు అందుబాటులో లేకుండా ఫామ్ హౌస్‌లో పడుకున్నాడు... మరి మీ అయ్య బార్ పెట్టుకోవాలి... మరి మీ అయ్యకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు? ఏం పెట్టుకోవాలి మీ అయ్య... తాగి పడుకునేవాడికి ఏం కావాలి... బార్ పెట్టుకొని బతకాలి. నువ్వు ప్రతిసారి తురుకోళ్ల గురించి మాట్లాడుతావ్. హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతావ్... మరి నువ్వో మసీదు కట్టుకో... నీ అయ్య బార్ పెట్టుకోవాలి... నువ్వు మసీదు కట్టుకోవాలి... టోపీ పెట్టుకో.. గడ్డం పెంచుకో... రోజు నమాజ్ చెయ్" అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామపంచాయతీలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు
గ్రామపంచాయతీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించారన్నారు. సర్పంచ్‌లు అప్పుల పాలయ్యారని... వారి ఆందోళనకు బీజేపీ మద్దతు పలుకుతోందన్నారు. సర్పంచ్‌లతో పనులు చేయించుకొని బిల్లులు ఇవ్వలేదన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం పేరు చెప్పి ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పించుకోవద్దని సూచించారు. సర్పంచ్‌ల సమస్యలపై అడిగే హక్కు బీఆర్ఎస్‌కు లేదన్నారు. తెలంగాణలో బీజేపీ పది లోక్ సభ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.