Revanth Reddy: ఆరోగ్యశ్రీ, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy orders on Arogyasri and digital health profile

  • ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను సడలించే అంశాన్ని పరిశీలించాలని సూచన
  • రాష్ట్రంలో అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి
  • అత్యవసర సమయంలో సరైన వైద్యం అందించేందుకు ఉపయోగపడుతుందని వెల్లడి

ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను సడలించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అధికారులకు సూచించారు. ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నిబంధనను పరిశీలించాలన్నారు. ఇదే సమయంలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌పై ముఖ్యమంత్రి దృష్టి సారించారు.

తెలంగాణలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నెంబరుతో అనుసంధానం చేయాలన్నారు. అలా చేయడం వల్ల ఏదేని అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News