Pushpa 2 Release Date: పుష్ప 2 రిలీజ్ డేట్‌పై చిత్ర బృందం క్లారిటీ!

Pushpa 2 makes says no change in release date of the movie
  • చాలా కాలంగా కానరాని పుష్ప 2 మూవీ అప్‌డేట్స్
  • రిలీజ్ డేట్స్‌పై నెట్టింట ఊహాగానాలు
  • వదంతులకు తెర దించే అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్
  • ఆగస్టు 15న మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని స్పష్టీకరణ
బ్లాక్ బస్టర్‌ మూవీ ‘పుష్ప’తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీంతో, ఆయన అభిమానుల ఆనందానికి అంతేలేకుండా పోయింది. పుష్ప-2పై కూడా అంచనాలు అదేస్థాయిలో పెరిగిపోయాయి. ఈ మూవీ కోసం ఫ్యాన్స్‌తో పాటూ సాధారణ ఆడియన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, పుష్ప-2కు సంబంధించి చిత్ర బృందం నుంచి కొత్తగా ఏ అప్‌డేట్ రాలేదు. ఫలితంగా తొలుత అనుకున్న రిలీజ్ డేట్‌పై కూడా సందేహాలు మొదలయ్యాయి. 

ఇలా స్పెక్యులేషన్ ఎక్కువైపోతుండటంతో మూవీ మేకర్స్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. రిలీజ్ డేట్‌పై పూర్తి స్పష్టత ఇచ్చేలా కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. పుష్ప 2 విడుదలకు సరిగ్గా 200 వందల రోజులే మిగిలుందని చెప్పారు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా మూవీ రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు. 

పుష్ప 2 చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది. డాలీ ధనంజయ, ఫహాద్ ఫాసిల్ వంటి స్టార్ ఆర్టిస్టులు మూవీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పుష్ప మూవీని బ్లాక్ బస్టర్ చేసిన అభిమానులు పుష్ప 2పై చాలా ఆశలే పెట్టుకున్నారు.
Pushpa 2 Release Date
Allu Arjun
Sukumar

More Telugu News