Maldives: మాల్దీవులను పట్టించుకోని భారతీయులు.. భారీగా తగ్గిన పర్యాటకుల సంఖ్య!
- గత మూడు వారాల్లో కేవలం 13,989 మంది భారతీయుల మాల్దీవుల పర్యటన
- సంఖ్య పరంగా ఐదో స్థానానికి చేరిన భారతీయ పర్యాటకుల సంఖ్య
- తొలి స్థానంలో రష్యా, మూడవ స్థానంలో చైనా
- గతేడాది మాల్దీవులు సందర్శించిన విదేశీయుల్లో భారతీయులే నెం.1
భారత ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలతో మొదలైన దౌత్య వివాదం మాల్దీవుల పర్యాటకంపై పెను ప్రభావం చూపిస్తోంది. ఒకప్పుడు మాల్దీవులకు క్యూకట్టే భారతీయుల సంఖ్య వారాల వ్యవధిలోనే దారుణంగా పడిపోయింది. మాల్దీవులకు వెళ్లే విదేశీయుల్లో భారతీయుల వాటా ఒకటో స్థానం నుంచి ఏకంగా ఐదో స్థానానికి పడిపోయింది. గత మూడు వారాల్లో కేవలం 13,989 మంది భారతీయులే ఆ దేశంలో పర్యటించారు. ప్రస్తుతం ఈ లిస్టులో తొలి స్థానంలో రష్యా ఉండగా మూడో స్థానంలో చైనా ఉంది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం..
- రష్యా: 18,561 మంది పర్యాటకులు (10.6% మార్కెట్ వాటా, 2023లో 2వ ర్యాంక్)
- ఇటలీ: 18,111 మంది (10.4% మార్కెట్ వాటా, 2023లో 6వ ర్యాంకు )
- చైనా: 16,529 మంది (9.5% మార్కెట్ వాటా, 2023లో 3వ ర్యాంకు )
- యూకే: 14,588 మంది (8.4% మార్కెట్ వాటా, 2023లో 4వ ర్యాంకు )
- ఇండియా: 13,989 మంది (8.0% మార్కెట్ వాటా, 2023లో 1వ ర్యాంకు )
- జర్మనీ: 10,652 మంది (6.1% మార్కెట్ వాటా)
- యూఎస్ఏ: 6,299 మంది (3.6% మార్కెట్ వాటా, 2023లో 7వ ర్యాంకు )
- ఫ్రాన్స్: 6,168 మంది (3.5% మార్కెట్ వాటా, 2023లో 8వ ర్యాంకు)
- పోలాండ్: 5,109 మంది (2.9% మార్కెట్ వాటా, 2023లో 14వ ర్యాంకు)
- స్విట్జర్లాండ్: 3,330 మంది (1.9% మార్కెట్ వాటా, 2023లో 10వ ర్యాంకు)
గతేడాది మొత్తం 209,198 భారతీయులు మాల్దీవులను సందర్శించారు. అక్కడ పర్యటించిన విదేశీయుల్లో 11 శాతంగా ఉన్న భారతీయులు.. గతేడాది సంఖ్యా పరంగా నెం.1 స్థానంలో నిలిచారు. అయితే, జనవరి 2న ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ సందర్శన తరువాత ఇరు దేశాల మధ్య దౌత్యవివాదం మొదలైంది. ఫలితంగా భారతీయులు మాల్దీవులవైపు కన్నెత్తి కూడా చూడట్లేదు.