Vijayasai Reddy: టీడీపీ ఇప్పుడు 'టి.డి.పి' సమస్యను ఎదుర్కొంటోంది: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy says TDP now facing Twin Deficit Problem
  • టీడీపీ పతనం స్పష్టంగా తెలుస్తోందన్న విజయసాయి
  • ఫిబ్రవరి తర్వాత రాజ్యసభలో టీడీపీకి ఒక్క ఎంపీ కూడా ఉండరని వెల్లడి
  • లోక్ సభ ఎన్నికల్లోనూ అదే ఫలితం వస్తుందని ట్వీట్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విపక్ష టీడీపీపై మరోసారి ధ్వజమెత్తారు. టీడీపీ పతనం స్పష్టంగా తెలుస్తోందని ట్వీట్ చేశారు. "ఈ ఫిబ్రవరి తర్వాత రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం సున్నా. ఆ తర్వాత లోక్ సభలోనూ సున్నా. చరిత్రలో తొలిసారిగా టీడీపీకి ఉభయ సభల్లో ఒక్క ఎంపీ కూడా మిగలరు. టీడీపీ ఇప్పుడు టి.డి.పి (ట్విన్ డెఫిసిట్ ప్రాబ్లం) సమస్యను ఎదుర్కొంటోంది. టీడీపీ నాయకత్వ లోటు, విశ్వసనీయత లోటుతో బాధపడుతోంది" అని విజయసాయిరెడ్డి వివరించారు.
Vijayasai Reddy
YSRCP
TDP
Rajya Sabha
Lok Sabha
Andhra Pradesh

More Telugu News