AP Budget Sessions: ఏపీ బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్

Date fixed for AP Assembly budget sessions

  • ఫిబ్రవరి 5 నుంచి బడ్జెట్ సమావేశాలు
  • మూడు నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం
  • ప్రస్తుతం ప్రవేశ పెట్టేది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు నుంచి ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను మాత్రమే ప్రవేశ పెట్టనున్నారు. ఎన్నికలు పూర్తయ్యాక కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరుగుతుంది. 

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఎన్నికలు జరిగే సంవత్సరంలో ప్రవేశపెడతారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఖర్చుల కోసం అవసరమైన నిధులను కాన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసుకుంటారు. దీనికి ఆమోదం తెలపడం కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సెషన్స్ నిర్వహిస్తారు. 

ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. టీడీపీ, జనసేనలు పొత్తులో బరిలోకి దిగబోతున్నాయి. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు సింగిల్ గా పోటీ చేయబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచార రంగంలోకి దూకాయి.

  • Loading...

More Telugu News