Elon Musk: ఎలాన్ మస్క్‌కు భారీ పారితోషికం.. కుదరదన్న న్యాయస్థానం

US Judge Voids Elon Musks 56 Billion Tesla Compensation

  • 2018 టెస్లా సీఈఓగా మస్క్‌కు 56 బిలియన్ డాలర్ల పారితోషికానికి బోర్డు నిర్ణయం
  • లక్ష్యాలను చేరుకుంటే ఈ మేరకు చెల్లించాలంటూ నిర్ణయం
  • నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన షేర్‌ హోల్డర్లకు అనుకూల తీర్పు
  • పారితోషికంపై బోర్డు నిర్ణయం వెనక మస్క్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉందని కోర్టు వ్యాఖ్య
  • బోర్డు నిర్ణయాన్ని రద్దు చేస్తూ తీర్పు 

టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు సంస్థ బోర్డు ప్రకటించిన 56 బిలియన్ డాలర్ల పారితోషికం చెల్లదంటూ డెలావేర్ ఛాన్సలరీ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. మస్క్‌కు అనవసరంగా అధిక పారితోషికం చెల్లిస్తున్నారన్న ఓ షేర్ హోల్డర్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు వెలువరించారు. 

టెస్లా సంస్త సీఈఓ ఎలాన్ మస్క్‌కు సంస్థ బోర్డు 2018లో 55.8 బిలియన్ డాలర్ల ప్యాకేజీని చెల్లించేందుకు అంగీకరించింది. ఇందులో భాగంగా సీఈఓ.. తన లక్ష్యాలు చేరుకున్న సందర్భంలో కొన్ని షేర్లు కేటాయించేందుకు అనుమతించింది. కానీ కొందరు మాత్రం ఈ అసాధారణ పాతోషికానికి అభ్యంతరం చెబుతూ కోర్టును ఆశ్రయించారు. 2022లో కేసుపై విచారణ మొదలుకాగా తాజాగా తీర్పు వెలువడింది. 

మస్క్ పారితోషికాన్ని రద్దు చేసిన న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మస్క్‌కు బోర్డు పారితోషికం ఆమోదించిన విధానం తప్పులతడకగా ఉందన్నారు. మస్క్ తరపున పారితోషికం కోసం ప్రయత్నించిన డైరెక్టర్లకు మస్క్‌తో సంబంధాలు ఉన్నాయన్నారు. పారితోషికం తాలూకు చర్చల్లో మస్క్ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. కాగా, ఈ తీర్పుపై మస్క్ మండిపడ్డాడు. డెలావేర్‌లో జనాలు కంపెనీలు పెట్టకూడదని సూచించారు.

  • Loading...

More Telugu News